Mahaa Daily Exclusive

  డబ్బులేక ఏ ప్రాణం పోకూడదనే సీఎం చంద్రబాబు సంకల్పం: చీఫ్ విప్ జీవీ

Share

సీఎం సహాయ నిధి చెక్కు అందజేసిన చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు

అవసరానికి డబ్బుల్లేక ఏ ఒక్కరి ప్రాణం పోకూడదనే ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పమన్నా రు ప్రభుత్వ చీఫ్‌విప్‌. వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. అందుకే అనారోగ్యం బారిన పడి వైద్య చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పేదలకు సీఎం సహాయ నిధి నుంచి సత్వరం చేయూత అందిస్తున్నట్లు తెలిపారు ఆయన. వినుకొండ మండలం నరగాయపాలెం గ్రామానికి చెందిన వెన్నా కృష్ణమ్మ కుటుంబానికి మంగళవారం రూ.65వేల సీఎంఆర్‌ఎఫ్‌ సహాయాన్ని స్వయంగా అందించారు చీఫ్‌విప్ జీవీ. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు కృష్ణమ్మ. ఆ నేపథ్యంలోనే ఆర్థిక ఇబ్బందుల వలన చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు రిఫరెన్స్ లెటర్ ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నారు. సీఎం సహాయ నిధి నుంచి వచ్చిన చెక్కును కృష్ణమ్మ కుటుంబసభ్యులకు చీఫ్ విప్ జీవీ అందజేశారు.