కొయ్యలగూడెం లో ‘దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటాం’ పోలవరం శాసనసభ్యులు శ్రీ చిర్రి బాలరాజు గారు..
కొయ్యలగూడెంలో సోమవారం పాత్రికేయుడిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అన్నారు. మంగళవారం జిలుగుమిల్లి క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
మీ ఎమ్మెల్యే మీకోసం అనే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పోలవరం శాసనసభ్యులు శ్రీ చిర్రి బాలరాజు గారు..ప్రతి మండలంలోనూ ఒకరోజు గ్రీవెన్స్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది…అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు అందుబాటులో ఉంటారు.. ప్రజలు వారి యొక్క సమస్యలు అర్జిల రూపంలో తెలియజేయవలసిందిగా తెలిపారు…
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వంపై పలువురు నిందలు వేయడం బాధాకరంగా ఉందని తెలియజేసారు..
Post Views: 10