Mahaa Daily Exclusive

  ఎన్నికల పోలింగ్.. రేపు ఈ జిల్లాల్లో సెలవు…!

Share

ఎన్నికల పోలింగ్.. రేపు ఈ జిల్లాల్లో సెలవు
ఆంధ్రప్రదేశ్ : డిసెంబర్ 5న ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. పోలింగ్ సందర్భంగా ఆయా జిల్లాల్లో స్థానికంగా రేపు సెలవు ఇవ్వాలని సీఎస్ నీరభ్ కుమార్ కలెక్టర్లకు ఆదేశించారు. అవసరమైతే ఇవాళ కూడా సెలవు ఇవ్వాలన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలుగా ఉపయోగించుకునే కార్యాలయాలకు సెలవు ప్రకటించడంపై కలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలని సూచించారు.