Mahaa Daily Exclusive

  కాంగ్రెస్ పాలనకు పాస్ మార్కులు..

Share

  • రేవంత్ కు ఐదేళ్ళు ఢోకా లేదు
  • అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే.. ఏడాదిలో పెరిగిన కాంగ్రెస్ బలం
  • కాంగ్రెస్ పాలనపై 53శాతం మంది సంతృప్తి
  • జీతాలు, పెన్షన్లు సకాలంలో వస్తున్నాయని 73శాతం మంది సంతృప్తి
  • రేవంత్ మాటకారి.. ఆయన స్పీచ్ లకు అభిమానులున్నారు
  • కేసీఆర్ ఫాంహౌజ్ దాటకపోవడం మంచిదికాదు
  • అధికారం లేకుండా ఆగలేకపోతుంది బిఆర్ఎస్
  • కేసీఆర్ కాళేశ్వరం పేరుతో దోచుకుంటే.. రేవంత్ మూసీ పేరుతో దోచుకుంటాడు
  • కేసీఆర్ చేసిన రచ్చ సరిచేయాలంటే ఖచ్చితంగా టైం పడతది
  • కాంగ్రెస్ ఆరుగ్యారంటీలలో కొన్నే అమలు
  • ఏడాదిపాలనపై తాజా సర్వే

 

హైదరాబాద్, మహా

కాంగ్రెస్ ఏడాదిపాలను వివిధ సర్వేలలో పాస్ మార్కులు వేస్తున్నారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 39.40 శాతం ఓట్లు సాధించగా, తాజాగా వోటా నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్ పాలనపై 53శాతం మంది సంతృప్తిగా ఉన్నట్లు తేలింది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కాంగ్రెస్ 60శాతం మార్కులతో పాస్ అయిందన్నారు. ఐదుమాసాలు లోక్ సభ ఎన్నికలు, కోడ్ కారణంగా పోగా.. కాంగ్రెస్ జాతీయ పార్టీ కావడంతో తొలి ఏడాది కొన్ని నిర్ణయాలు వేగంగా జరగలేదు. అయినా ప్రజల్లో కాంగ్రెస్ పై మోజు పోలేదని స్పష్టమవుతోంది. అయితే మరోవైపు బిఆర్ఎస్ కూడా అదే స్థాయిలో బలంగా ఉంది. లోక్ సభ ఎన్నికల్లో సున్నావచ్చినా గ్రౌండ్ లో బలంగానే ఉంది. ప్రజావాణి దరఖాస్తులు కొన్ని పరిష్కారం అవుతాయని, ఆరు గ్యారంటీలు కొన్ని మంచిగానే అమలవుతున్నాయని సర్వేలలో పేర్కొన్నారు. జీతాలు, పెన్షన్లు సకాలంలో అందుతున్నాయని 73శాతం మంది స్పష్టంగా చెప్పడం విశేషం. వ్యక్తిగతంగా కేసీఆర్ క్రేజ్ తెలంగాణలో అలాగే ఉండగా, రేవంత్ ప్రభుత్వానికి ఐదేళ్ళు ఢోకాలేదని ప్రజలు సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి 41శాతం మంది 50శాతానికి పైగా మార్కులు వేస్తున్నారు. మొత్తంగా కాంగ్రెస్ పాలన ఆశాజనకంగా ఉందని, అయితే అద్భుతంగా లేదని చెప్నేస్తున్నారు. మూసీ ప్రక్షాళన అవసరమని 50శాతం మంది అభిప్రాయపడుతుండగా, హైడ్రాపై భగ్గుమంటున్నారు.

 

రేవంత్ మాటకారి

 

రేవంత్ మాటకారి అని.. ఆయన స్పీచ్ లకు అభిమానులున్నారని సర్వేలో వెల్లడైంది. పలు అభిప్రాయాలను ప్రజలు కుండబద్దలు కొట్టారు. కేసీఆర్ కాళేశ్వరం పేరుతో దోచుకుంటే.. రేవంత్ మూసీ పేరుతో దోచుకుంటాడని కొందరు విమర్శలు చేయగా, కేసీఆర్ చేసిన రచ్చ సరిచేయాలంటే ఖచ్చితంగా టైం పడతదని, ముఖ్యమంత్రిగా రేవంత్ కు మరింత సమయం ఇవ్వాలని పలువురు వోటా సర్వే సందర్భంగా అభిప్రాయపడ్డారు. కేసీఆర్ ఫాంహౌజ్ కే పరిమితం కావడం మంచిది కాదని, అధికారం లేకుండా బిఆర్ఎస్ ఆగలేకపోతోందని పలువురు విమర్శించారు. కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్ కు ఓటేశామని, రేవంత్ కు బండిసంజయ్, ధర్మపురి అర్వింద్ పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నారని సర్వేలో పలువురు అభిప్రాయాలు వెల్లడించారు. తులం బంగారం ముచ్చట తుంగలో తొక్కారని, జీరో బిల్లు విషయంలో అక్రమాలు జరుగుతున్నాయని పలువురు అభిప్రాయపడ్డారు.