Mahaa Daily Exclusive

  అంబేద్క‌ర్ ఓపెన్ యూనివ‌ర్సిటీ వీసీగా ప్రొఫెస‌ర్ ఘంటా చ‌క్ర‌పాణి..

Share

హైద‌రాబాద్ : తెలంగాణ‌లోని డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ ఓపెన్ యూనివ‌ర్సిటీకి రాష్ట్ర ప్ర‌భుత్వం వైస్ ఛాన్స్‌ల‌ర్‌ను నియ‌మించింది. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేసింది. అంబేద్క‌ర్ ఓపెన్ యూనివ‌ర్సిటీ వీసీగా ప్రొఫెస‌ర్ ఘంటా చ‌క్ర‌పాణిని నియ‌మిస్తూ ఉత్త‌ర్వులు వెల్ల‌డించింది. ఈ ప‌దవిలో చ‌క్ర‌పాణి మూడేండ్ల పాటు కొన‌సాగ‌నున్నారు. గ‌తంలో అంబేద్క‌ర్ ఓపెన్ యూనివ‌ర్సిటీలో సోషియాల‌జీ డిపార్ట్‌మెంట్‌లో ప్రొఫెస‌ర్‌గా చ‌క్ర‌పాణి విధులు నిర్వ‌ర్తించారు. తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత టీఎస్‌పీఎస్సీ తొలి చైర్మ‌న్‌గా ఘంటా చ‌క్ర‌పాణి సేవ‌లందించారు.