Mahaa Daily Exclusive

  రంగంలోకి కేసీఆర్..

Share

  • 8న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కీలకభేటీ
  • తాజా రాజకీయపరిణామాలపై కీలక నిర్దేశం

 

హైద‌రాబాద్ : ఈ నెల 8వ తేదీన మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పార్టీ అధినేత‌, తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌మావేశం కానున్నారు. ఈ స‌మావేశం ఎర్ర‌వెల్లిలోని వ్య‌వ‌సాయ క్షేత్రంలో జ‌ర‌గ‌నుంది. ఈ విష‌యాన్ని పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్ల‌డించారు. తెలంగాణ తల్లి రూపం మార్పు, అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కేసీఆర్ భేటీ కీలక ప్రాధాన్యం సంతరించుకుంది.