- ఒక్కో నవోదయలో 56మంది విద్యార్ధులకు ప్రవేశం
- విజయోత్సవాల వేళ.. కేంద్రం గుడ్ న్యూస్
- సాధించిన సీఎం రేవంత్.. నాడు కేసీఆర్ ప్రయత్నించినా అందని సహకారం
ఢిల్లీ, మహా: తెలంగాణకు కేంద్రం శుభవార్త చెప్పింది. తెలంగాణలో కొత్తగా 7 నవోదయ విద్యాలయాలు ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. కేంద్ర కేబినెట్ లో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను మీడియాకు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. దేశ వ్యాప్తంగా 85 కొత్త కేంద్రీయ విద్యాలయాలు, 28 కొత్త నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని అన్నారు. దేశ వ్యాప్తంగా 85 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు రూ.5872 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు. ఒక్కో కేంద్రీయ విద్యాలయంలో 960 మంది విద్యార్థులకు అవకాశం కల్పించినట్లు వివరించారు. దేశ వ్యాప్తంగా 28 నవోదయ విద్యాలయాల కోసం రూ.2359.82 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక్కో నవోదయ విద్యాలయంలో 560 మంది విద్యార్థులకు అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. గతంలో కేసీఆర్ రాష్ట్రంలో నవోదయ విద్యాలయాల కోసం అనేక ప్రయత్నాలు చేసినా, ఐదారేళ్ళు అనేక ప్రెస్ మీట్లలో మాట్లాడినా సాధించలేకపోయారు. ఇపుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఏడాది తిరక్కుండానే సాధించారు. సరిగ్గా ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా కేంద్రం రేవంత్ కు గుడ్ న్యూస్ చెప్పింది. ఏడు నవోదయ విద్యాలయాలు మంజూరుచేసింది. రాష్ట్రానికి ఫలితం దక్కింది.
తెలంగాణలో నూతన కొత్త నవోదయ విద్యాలయాలివే..
1. జగిత్యాల
2. నిజామాబాద్
3. కొత్తగూడెం
4. మల్కాజ్‌గిరి..
5. మహబూబ్‌నగర్
6. సంగారెడ్డి
7. సూర్యాపేటలో
కొత్త నవోదయ విద్యాలయాలు