Mahaa Daily Exclusive

  స్మార్ట్ సిటీ పనులను పరిశీలించిన కమిషనర్ ..!

Share

వరంగల్ మహా;

వరంగల్ నగరంలోని భద్రకాళి బండ్ పై పూర్తయిన స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ శనివారం క్షేత్ర స్థాయి లో పరిశీలించారు.
స్మార్ట్ సిటీ ప్రాజెక్టు లో భాగంగా భద్రకాళి బండ్ పై ఎ బి సి డి జోన్ల వారీగా ఇప్పటికే పూర్తి చేసిన పనులను వాటి అంచనా వ్యయాల తో పాటు సమగ్ర వివరాలను కమిషనర్ ఇంజనీరింగ్ స్మార్ట్ సిటీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బొంది వాగు నుండి వచ్చే నాలతో పాటు పోతన జంక్షన్ ప్రాంతం నుండి వచ్చే 12 మోరీల నాలలను కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా జోన్ లలో మిగిలిపోయిన ఎలక్ట్రికల్ సివిల్ పనులను కమిషనర్ పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ఈ ఈ లు శ్రీనివాస్, రవికుమార్, స్మార్ట్ సిటీ ప్రతినిధులు ఆనంద్ ఓలేటి, శ్రీనివాసరాజు, లక్ష్మారెడ్డి, తదితరులు, పాల్గొన్నారు.