ఆదిలాబాద్, మహా :
ఆదిలాబాద్ పట్టణంలోని కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజా సేవ భవన్లో శనివారం ప్రజా దర్భార్ నిర్వహించారు. నియోజకవర్గంలోని ప్రజలు, పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రజలు తమ సమస్యలను ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి కి వివరించి వినతి పత్రాలు అందించారు. సమస్యలపై సానుకూలంగా స్పందిస్తూ సమస్యలను ప్రభుత్వ పెద్దల వద్దకు చేర్చి పరిష్కారం కోసం కృషి చేస్తానని కంది శ్రీనివాస రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, జైనథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి,కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్, సెడ్మకే ఆనంద్ రావు, భూపెల్లి శ్రీధర్,,మునిగెల విట్టల్, లోక ప్రవీణ్ రెడ్డి, జహీర్ రంజానీ ,బండారి సతీష్, మజాహిదీన్ ,శాంతన్ రావు, అల్చెట్టి నాగన్న, సుధాకర్ గౌడ్, రాందాస్ నాక్లే,M A షకీల్,కాప్రి వెంకట్ రెడ్డి, భోజ రెడ్డి, అఫ్రోజ్, సంజీవ్ రెడ్డి, శ్రవణ్ నాయక్,భావన సింగ్, లత ,సోనియా మంథని,గంటూ బాయి, కుమ్ర చంద్ర షావు తదితరులు హాజరయ్యారు.







