Mahaa Daily Exclusive

  నిత్యాన్న‌దానం సంద‌ర్శించి స్వ‌యంగా వ‌డ్డ‌న చేసిన కంది శ్రీ‌నివాస రెడ్డి ..!

Share

ఆదిలాబాద్, మహా :
ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీ‌నివాస రెడ్డి ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఆదిలాబాద్ ప‌ట్ట‌ణంలోని ప్ర‌జా సేవాభ‌వ‌న్ లో గ‌త మూడున్న‌రేళ్ళుగా నిరంత‌రాయంగా కొన సాగుతున్న నిత్యాన్న దాన కేంద్రాన్ని కంది శ్రీ‌నివాస రెడ్డి శ‌నివారం సంద‌ర్శించారు. కేంద్రానికి ఆక‌లి తీర్చుకోవ‌డానికి వ‌చ్చిన అంద‌రికి న‌మ‌స్క‌రిస్తూ ఆప్యాయంగా ప‌ల‌క‌రించారు. ఎలా ఉన్నారంటూ వారి యోగ‌క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. భోజ‌నం, తాగునీటి సౌక‌ర్యాల‌ను ప‌రిశీలించారు. వ‌చ్చిన వారికి ఆయ‌న స్వ‌యంగా వ‌డ్డ‌న చేస్తూ క‌డుపు నిండా భోజ‌నం చేయాల‌ని కోరారు. కంది శ్రీ‌నివాస రెడ్డి చేస్తున్న నిత్యాన్న దానంతో పాటు సామాజిక సేవ‌ల‌ను అంద‌రు ప్ర‌శంసించారు.పేద‌ల ఆక‌లి తీర్చ‌డం భ‌గ‌వంతుడు త‌న‌కు క‌ల్పించిన అదృష్ట‌మ‌ని కంది శ్రీ‌నివాస రెడ్డి అన్నారు.త‌రుచుగా వ‌చ్చేవారితో పాటు ఆదిలాబాద్ కు చుట్టుప‌క్క‌ల గ్రామాల వారు ఏ ప‌ని మీద వ‌చ్చినా మ‌ధ్యాహ్నం వేళ అన్న‌దాన కేంద్రంలో భోజ‌నం చేయ‌వ‌చ్చ‌ని తెలిపారు. తాను గెలిచినా ఓడినా నిత్యాన్నదానం మాత్రం కొన‌సాగుతుంద‌న్నారు. కార్య‌క్రమంలో జైనథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి, గిమ్మ సంతోష్, శాంత‌న్ రావు, భూపెల్లి శ్రీధర్,లోక ప్రవీణ్ రెడ్డి, సుధాకర్ గౌడ్, ఎంఏ ష‌కీల్ , రాంరెడ్డి,అశోక్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.