Mahaa Daily Exclusive

  ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన దుబ్బ శ్రీనివాస్..!

Share

వరంగల్ మహా;

వరంగల్ నగరంలో కాశిబుగ్గ ప్రాంతంలో వివేకానంద కాలనీలో డివిఆర్ ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో స్కీం ఫర్ కెపాసిటీ బిల్డింగ్ ఇన్ టెక్స్టైల్ సెక్టార్ సౌజన్యంతో మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కేంద్రంను ఆర్యవైశ్య మహాసభ వరంగల్ జిల్లా అధ్యక్షుడు దుబ్బ శ్రీనివాస్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన స్కూల్ డెవలప్మెంట్ స్కీమును అందరూ వినియోగించుకోవాలని ఉపాధి అవకాశాలు మెరుగుపరచు కోవాలని ఈ కుట్టు శిక్షణ నేర్చుకుని ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పదాలను పొంది వారి కుటుంబ పోషణకు ఉపయోగించుకోవాలని వారన్నారు ఈ శిక్షణ 45 రోజుల పాటు కొనసాగుతుందని బ్యాచ్ వరంగల్ నగరంలో ఐదు కేంద్రాల్లో ఏర్పాటు చేయడమైనది భవిష్యత్తులో కూడా అనేక కేంద్రాలు ఏర్పాటు చేసి కూడా ఈ జిల్లాల్లో ఉపాధి మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కల్పిస్తామని డివిఆర్ సంస్థ సెంట్రల్ గవర్నమెంట్ స్కిల్ డెవలప్మెంట్ వారి ఆధ్వర్యంలో చేస్తామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ కో ఆర్డినేటర్ అనూష, ఆర్యవైశ్య మహిళా విభాగం అధ్యక్షురాలు కళావతి, ఆర్గాన్స్ సెక్రటరీ సంపూర్ణ, ధనలక్ష్మి, సెంటర్ ట్రైనర్ చిప్ప సరిత, స్వరూప, తో పాటు ఉపాధి శిక్షణ పొందే 30 మంది మహిళలు పాల్గొన్నారు.