Mahaa Daily Exclusive

  సమస్యల పరిష్కారానికి ప్రజా పోరాటాలే మార్గం ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి..!

Share

వరంగల్ మహా;

కార్పొరేట్ పెట్టుబడిదారులకు అనుకూలంగా పాలకుల దోపిడీ విధానాలకు వర్గ సామాజిక ఐక్య పోరాటాలే ప్రత్యామ్నాయన్ని చూపిస్తాయని ఆ దిశలో వామపక్ష కమ్యూనిస్టు సామాజిక శక్తులు ఐక్యంగా ముందుకు సాగాలని ఆ దిశలో ప్రజా ఉద్యమాల నిర్మించాలని ఎం సి పి ఐ (యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి పిలుపునిచ్చారు. శనివారం భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ (ఐక్య) వరంగల్ నగర ప్లీనరీ సమావేశం కామ్రేడ్ ఎగ్గేని మల్లిఖార్జున్, ఐతం నాగేష్, మలోత్ ప్రత్యూష అధ్యక్ష వర్గంగా కరిమాబాద్ మున్నూరు కాపు సంఘం భవన్ లో జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గాదగోని రవి మాట్లాడుతూ కేంద్రంలోని మతోన్మాద బిజెపి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించి తమ ఇష్టానుసారంగా పాలను కొనసాగిస్తూ ప్రజల ఆశలను అడియాశలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో పేద మధ్యతరగతి ప్రజలపై నిత్యవసర వస్తువుల ధరల భారం విపరీతంగా పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు నిరుద్యోగం భారీగా పెరిగిపోతుందన్నారు. ప్రజల మధ్యన ఐక్యత లేకుండా కుల మత ప్రాంత విభేదాలతో రాజ్యాంగానికి వ్యతిరేకంగా మోడీ పాలన కొనసాగుతున్నదని నిర్బంధాలను ప్రయోగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో వినాశనకర విధానాలకు వ్యతిరేకంగా ప్రజా సమస్యల పరిష్కారానికి సామాజిక వర్గ పోరాటాలను ఐక్యంగా నడిపించాల్సిన బాధ్యత కమ్యూనిస్టులపై ఉందన్నారు ఆ దిశలో ఎంసిపిఐ(యు) కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పార్టీ నగర నిర్మాణం ప్రజా పోరాటాలపై కామ్రేడ్ సుంచు జగదీశ్వర్ రిపోర్టు ప్రవేశపెట్టగా ప్రతినిధులు చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించారు.
ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర జిల్లా నాయకులు, కార్యకర్తలు, నగర ప్రతినిధులు పాల్గొన్నారు.