Mahaa Daily Exclusive

  జిల్లా బీజేవైఎం ఆధ్వర్యంలో భారీ కాగడ ప్రదర్శన పాల్గొన్న జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్…!

Share

వరంగల్ మహా;

కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా శనివారం వరంగల్ జిల్లా బీజేవైఎం ఆధ్వర్యంలో వరంగల్ చౌరస్తా నుండి పోచమ్మ మైదానం వరకు నిర్వహించిన కాగడాల ర్యాలీలో యువత, నగర ప్రముఖులతో కలిసి బిజెపి జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ పాల్గొన్నారు.
అనంతరం
వారు మాట్లాడుతూ కార్గిల్ విజయ దివాస్ సందర్భంగా కాగడా ప్రదర్శన చేయడం జరిగింది. ఆనాడు పిరికిపంద పాకిస్తాన్ గుంట నక్క చర్యను భారత ఆర్మీ దీటుగా జవాబిస్తూ కార్గిల్లో విజయదుందుభి మోగించి భారత భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకుని నేటి కి 26 సంవత్సరాలు కావస్తున్న నేపథ్యంలో ఆ భీకర యుద్ధంలో అసువులు బాసిన భారత జవాన్లకు నివాళులర్పిస్తూ వరంగల్ చౌరస్తా నుంచి పోచమ్మ మైదాన్ జంక్షన్ వరకు భారీ కాగడ ప్రదర్శన చేస్తూ మాతృభూమి కోసం అమరులైన ప్రతి ఒక్క జవాను కు నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నేతలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.