భూపాలపల్లి మహా :
జిల్లాలో వర్షాలు కురుస్తున్నందున
రైతులు రసాయనిక ఎరువులు,పురుగు మందులు, గడ్డి మందులు పంట పొలాలకు వేయవద్దని జిల్లా ఇన్చార్జి వ్యవసాయ అధికారి బాబూరావు ఒక ప్రకటనలో తెలిపారు. సస్యరక్షణ చర్యలు చేపడితే పంటలకు పోషకాలు అందవని వర్షపు నీటికి వృధా అవుతాయని రైతులు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుందని డిఏఓ పేర్కొన్నారు. పత్తి చేనులో నీరు నిలిచి ఉన్నట్లయితే నీటిని తక్షణమే తీసివేయాలని నీటితో పత్తి మొక్కలు ఎర్రబడే అవకాశం ఉంటుందని తెలిపారు. రైతులు ఇతర సమాచారం కోసం మండల AO,AEO లను సంప్రదించాలని జిల్లా ఇన్చార్జి వ్యవసాయ అధికారి బాబురావు తెలిపారు.
Post Views: 57







