Mahaa Daily Exclusive

  మోదీ పాలన దేశానికి ప్రమాదకరం – సీపీఐ ఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం ..!

Share

ఖమ్మం, మహా.
మోదీ పాలన దేశానికి ప్రమాదకరమని సీపీఐ (ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు. శనివారం నగరంలోని సుందరయ్య భవన్ నందు జరిగిన ఖమ్మం డివిజన్ వర్క్ షాప్ లో ఆయన మాట్లాడుతూ బీజేపీ ఒక మతతత్వ పార్టీ అని విమర్శించారు. మోదీ అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాల పాలనలో ఆర్థిక రంగంలో సంస్కరణలను వేగవంతం చేశారని, ముఖ్యంగా రైల్వే, రక్షణ, విద్య, వైద్య, బీమా రంగంలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానించారని చెప్పారు. కార్మిక చట్టాలను సవరించి వారి హక్కులను ప్రభుత్వం కాలరాసిందన్నారు. బీజేపీ మతతత్వాన్ని కార్పొరేట్ శక్తులు కూడా సమర్థిస్తున్నాయని, ఇది అత్యంత ప్రమాదకరం అన్నారు. మైనారిటీల పై బీజేపీ దాడి చేస్తుందన్నారు. కొన్ని రాష్ట్రాల్లో మైనా తెలిపిన దాడులు చేస్తూ, పౌరసత్వం నిరూపించుకోవాలని చెప్తున్నారన్నారు. దేశాన్ని విచ్చిన్నం చేయాలని బీజేపీ చూస్తున్నదన్నారు. బిజెపి తెలంగాణలో అధికారంలోకి రావాలని చూస్తుందని,,, మనవాద సిద్ధాంతాలు అమలు చేస్తారన్నారు. వారి సిద్ధాంతం ప్రకారం దేశంలో ఇతర మతాలను రెండవ తరగతి పౌరులుగా గుర్తిస్తున్నారని అన్నారు. వ్యతిరేక విధానాలపై ఐక్య ఉద్యమాలు నిర్మించాలన్నారు. కేంద్ర బిజేపి ప్రభుత్వం దేశవ్యాప్త కులగణనను వ్యతిరేకిస్తుంది. కానీ కులగణనకు, రిజర్వేషన్లకు అనుకూలంగా రాష్ట్రంలో బిజేపి నాయకులు మాట్లాడుతున్నారు. బిజెపి మంత్రులు ద్వంద్వ వైఖరితో మాట్లాడుతుండతున్నారన్నారు. దేశంలో ప్రభుత్వ రంగాలను పూర్తిగా అంబానీ, అదానీ లకు తాకట్టు పెడుతున్నారు అని విమర్శించారు
ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు కళ్యాణం వెంకటేశ్వరరావు,ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై విక్రమ్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొంతు రాంబాబు, ఎర్ర శ్రీనివాసరావు, జిల్లా కమిటీ సభ్యులు తుమ్మ విష్ణువర్ధన్, బండా రమేష్, ఏం ఏ జబ్బార్, ఎస్ నవీన్ రెడ్డి, షేక్ మీరా సాహెబ్, దొంగల తిరుపతిరావు, మండల కార్యదర్శి భూక్య శ్రీనివాస్, నాగుల మీరా, బత్తిని ఉపేందర్, డివిజన్ కార్యదర్శివర్గ సభ్యులు వజినేపల్లి శ్రీనివాస్ , పత్తిపకా నాగ సులోచన తదితరులు పాల్గొన్నారు.