Mahaa Daily Exclusive

  నూతన రేషన్ కార్డుల పంపిణీ..!

Share

సత్తుపల్లి, జూలై 26: మహా.

మండల పరిధిలోని కొత్తూరు రైతు వేదికలో నియోజకవర్గ ఎమ్మెల్యే మట్టా రాగమయి జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి ఆధ్వర్యంలో నూతన రేషన్ కార్డ్ లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాగమయి మాట్లాడుతూ పది సంవత్సరాల బి.ఆర్.ఎస్ పాలనలో పేదవాడి ఆకలి తీర్చడంలో పూర్తిగా విఫలం చెందిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో దారిద్ర రేఖకు దిగువన ఉన్న పేదవాడి ఆయుధమైన రేషన్ కార్డు పంపిణీ, ప్రతి పేదవాడు నివసించడానికిని ఇందిరమ్మ ఇల్లు, మహిళలను ప్రయోజకులను చేయడానికి సహకారం చేస్తూ వడ్డీ లేని రుణాలు, మహిళలు వివిధ వృత్తులు చేసుకుంటూ ప్రయాణ సమయంలో ఆదాయంలో కొరత ఏర్పడకుండా ఉచిత బస్సు, రైతన్నలకు రుణమాఫీ, గృహ అవసరాలకు ఉపయోగించే 200 యూనిట్ల కరెంట్ ఉచితం మరెన్నో చారిత్రాత్మక పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం లోనే పేదవాడికి చేరువ అయ్యాయని ఎమ్మెల్యే అన్నారు. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ మీ కలలు సహకారం చేసే ప్రభుత్వానికి అండగా ఉండాలని మీ సహకారం ఉంటేనే మాలో పనిచేసే ఉత్సాహం పెరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో సత్తుపల్లి అగ్రగామిక నిలిచిందన్నారు. నియోజకవర్గంలో 3500 గృహాలు నిర్మాణం చేపట్టగా 3000 గృహాలు పూర్తి దశకు చేరుకున్నాయని పనులు వేగవంతంగా నిర్వహిస్తున్న అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ విజయకుమార్ , ఆర్డీవో రవీంద్ర, ఎం.ఆర్.ఓ, ఎం.పీ.డీ.వో ఆర్.సి.హెచ్ నాగేశ్వరరావు, కిష్టారం ప్రాజెక్ట్ ఆఫీసర్ నరసింహారావు, ఎఫ్.ఆర్.వో స్నేహలత కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గాదే చెన్నారావు, సీనియర్ నాయకులు చలగళ్ళ నరసింహారావు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు.