కారేపల్లి, మహా:అధిక వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితేనే బయటకు రావాలని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పిఎస్ఆర్ యూత్ మండల అధ్యక్షుడు జర్పల ధోని నాయక్ ఓ ప్రకటనలో తెలిపారు.మండల కేంద్రంలో శనివారం ఆయన మాట్లాడుతూ నిరంతరంగా కురుస్తున్న వర్షాల పోలంపల్లి పరిధిలోని బుగ్గవాగు కాలువ ఉద్రిక్తంగా ప్రవహిస్తున్న తరుణంలో రైతులు పలు జాగ్రత్తలు పాటించాలని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీసులకు,ప్రభుత్వ అధికారులకు తక్షణ సమాచారం అందించాలని కోరారు.వరద నీరు చేరిన కాలనీ నివాసులు అప్రమత్తంగా ఉండి అధికారులకు సమాచారం అందించాలని అన్నారు.
Post Views: 45







