కారేపల్లి, మహా : కారేపల్లి మండలంలో కోమట్లగూడెం హైస్కూల్ లో శనివారం మధ్యాహ్నభోజనంను ఎంపీడీవో మల్లెల రవీంద్రప్రసాద్ తనిఖీచేశారు. మధ్యాహ్న భోజన మెనూ, బియ్యం, కూరగాయలను ఎంపీడీవో పరిశీలించారు. నాణ్యతపై విద్యార్ధులను అడిగితెలుసుకున్నారు. విద్యార్ధుల ఎదుర్కోంటున్న సమస్య లపై చర్చించారు. పాఠశాలలోనే భోజనం చేశారు. తరగతి గదులను పరిశీలించి విద్యార్ధుల ప్రతిభను పరీక్షించారు. ఈకార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నాగలక్ష్మి, హెచ్‌ఎం శారద, శ్రీనివాస్, సీఆర్‌పీ పరమేష్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 55







