కారేపల్లి, మహా : భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం సోములగూడెం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కారేపల్లి మండలం మాధారం గ్రామానికి చెందిన తూరపాటి రాజు(30) మృతి చెందాడు. మాధారం బుడిగజంగాల కాలనీకి చెందిన తూరపాటి రాజు ద్విచక్రవాహనంపై గ్రామాల్లో తిరుగుతూ గ్యాస్ స్టవ్‌ల రిపేరు పని చేస్తుంటాడు. శనివారం పాల్వంచవైపు పని నిమిత్తం వెళ్లాడు. లక్ష్మిదేవిపల్లి ` భద్రాచలం రహదారి సోములగూడెం వద్ద వర్షానికి అదుపుతప్పిన మోటర్ సైకల్ ప్రమాదావశాత్తు డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈప్రమాదంలో రాజు రోడ్డుపై పడి తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య రమణ, ఇద్దరు కుమారులు ఉన్నారు. సంచారజాతికి చెందిన రాజు కుటుంబం అతని ఆదాయం పైనే ఆధారపడి జీవిస్తుంది. భార్య రమణ కూలీ పనులు చేస్తూ భర్త చేదోడుగా ఉంటుంది. కుటుంబ పెద్ద మృతితో ఆ కుటుంబం దిక్కుతోచని స్ధితికి వెళ్ళింది.







