కారేపల్లి, మహా : దసరా సందర్బంగా కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లి కోటమైసమ్మ తల్లి అలయ ప్రాంగనంలో నిర్వహించే జాతరలో కొబ్బరికాయల అమ్మకానికి వేలం పాటను ఈనెల 28న నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ డాక్టర్ పర్సా పట్టాభి రామారావు, ఈవో కొండకింది వేణుగోపాలాచార్యులు ఒక ప్రకటనలు తెలిపారు. సెప్టెంబర్ 26 వ తేదీ నుంచి అక్టోబర్ 6వ వరకు 11రోజులు పాటు జరిగే జాతరలో కొబ్బరి కాయల అమ్మకాలకు ఈనెల 17వతేదిన వేలం పాటలు నిర్వహించగా పాటదారులు ముందుకు రాలేదు. దీంతో కొబ్బరికాయల వేలం వాయిదా పడిరది. దీనికి సంబంధించి ఈనెల 28వతేదిన వేలం పాట నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.
Post Views: 41







