Mahaa Daily Exclusive

  ఆపరేషన్‌ సిందూర్‌ విజయం వెనుక.. ‘మేక్‌ ఇన్‌ ఇండియా’: మోదీ

Share

పాకిస్థాన్‌ను మట్టికరిపించిన ‘ఆపరేషన్ సిందూర్’ విజయం వెనుక ‘మేక్‌ ఇన్ ఇండియా’, మన సాంకేతికత దాగి ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బెంగళూరులో మెట్రో మూడో ఫేజ్‌ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ప్రధాని ప్రసంగించారు. ‘ఆపరేషన్ సిందూర్ సమయంలో ప్రపంచం తొలిసారి సరికొత్త భారత్‌ను చూసింది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా భారత్‌ వేగంగా అడుగులు వేస్తోంది’ అని అన్నారు.

Latest