Mahaa Daily Exclusive

  డిజిటల్‌ ఓటర్‌ లిస్ట్‌ను బయటపెట్టాలి: రాహుల్ గాంధీ డిమాండ్

Share

రాహుల్‌ గాంధీ ఎన్నికల కమిషన్‌పై మరోసారి విమర్శలు గుప్పిస్తూ, డిజిటల్‌ ఓటర్‌ లిస్ట్‌ను ప్రజలకు అందుబాటులో పెట్టాలని డిమాండ్‌ చేశారు. ‘ఎక్స్‌’లో ఓ వీడియో షేర్‌ చేస్తూ, ఓటు దొంగతనం అనేది ప్రజాస్వామ్యానికి తీవ్రమైన దాడి అని, స్వేచ్ఛాయుత ఎన్నికలకు పారదర్శక ఓటరు జాబితా అవసరమని అన్నారు. ప్రజలు, రాజకీయ పార్టీలు స్వయంగా ఆడిట్‌ చేసేందుకు డిజిటల్‌ జాబితా ఉండాలని పిలుపునిచ్చారు. తమ పోరాటంలో అందరూ భాగస్వాములవ్వాలని కోరారు.

Latest