AP: జడ్పీటీసీ ఉప ఎన్నికల వేళ పులివెందులలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి కడపకు తరలించిన విషయం తెలిసిందే. తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి ఇంటికి పోలీసులు చేరుకున్నారు. ఆయనను హౌస్ అరెస్ట్ చేయగా.. కార్యకర్తలు అడ్డుకున్నారు. దాంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. అటు వేంపల్లిలో వైసీపీ నేత సతీష్ రెడ్డిని కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
Post Views: 25






