AP: పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉప ఎన్నికలపై మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నికలను రద్దు చేయాలంటూ మాట్లాడారు. రెండు ZPTC సీట్లను బలవంతంగా చెరబట్టేందుకు ఒక గూండా మాదిరిగా చంద్రబాబు అరాచకాలు చేసి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారంటూ మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని తీవ్రంగా గాయపరిచిన ఈ రోజు నిజంగా ఒక బ్లాక్ డే అంటూ వ్యాఖ్యానించారు. కేంద్ర బలగాల ఆధీనంలో తిరిగి ఎన్నికలు జరపాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.
Post Views: 53







