AP: పులివెందుల, ఒంటిమిట్టలో 11 నామినేషన్‌లు వచ్చాయని, వైసీపీకి 11 లక్కీ నంబర్ అని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అన్నారు. జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ‘పులివెందులలో ఈసారి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి. అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు వేశారు. వైసీపీ పాలనలో స్వేచ్ఛగా ఎన్నికలు జరిగిన దాఖలాలు లేవు’ అని తెలిపారు.
Post Views: 16







