AP: చరిత్రలో ఇంత దారుణమైన ఎన్నికలు జరగలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. మంగళవారం విజయవాడలోని ఎన్నికల కమిషన్ ఆఫీసులో పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలపై వైసీపీ నేతలతో కలిసి అంబటి రాంబాబు ఫిర్యాదు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఓటు వేయడానికి ఓటర్లు పోలీసుల కాళ్లు పట్టుకోవాల్సి పరిస్థితి వచ్చిందన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచి జగన్ పనైపోయిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. జడ్పీటీసీ ఎన్నికల్లో అరాచకం రాజ్యమేలుతోందన్నారు.
Post Views: 74







