Mahaa Daily Exclusive

  ఆదిలాబాద్ లో రాజీవ్ జ్యోతి స‌ద్భావ‌న యాత్ర‌కు ఘ‌న స్వాగ‌తం కంది శ్రీ‌నివాస రెడ్డి క్యాంపు కార్యాల‌యంలో రాత్రి బ‌స‌, భోజ‌న వ‌స‌తి..!

Share

ఆదిలాబాద్ మ‌హా : 34వ రాజీవ్ జ్యోతి స‌ద్భావ‌నా యాత్ర గురువారం రాత్రి ఆదిలాబాద్ కు చేరుకుంది. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీ‌నివాస రెడ్డి క్యాంపు కార్యాల‌యంలో యాత్రికుల‌కు పార్టీ శ్రేణులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. కంది శ్రీ‌నివాస రెడ్డి ఆదేశానుసారం రాత్రి ప్ర‌జా సేవాభ‌వ‌న్ లోనే యాత్రికుల‌కు బ‌స భోజ‌న వ‌స‌తి ఏర్పాటు చేసారు. శుక్ర‌వారం ఉద‌యం క్యాంపు కార్యాల‌య ఆవ‌ర‌ణ‌లో జ‌రిగిన 79వ స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల‌లో యాత్రికులు పాల్గొని జాతీయ జెండాకు వంద‌నం చేసారు.
రాజీవ్ జ్యోతి యాత్ర చైర్మ‌న్ ఆర్. దొరై ఆధ్వ‌ర్యంలో గ‌త 33 ఏళ్లుగా స‌ద్భావ‌నా జ్యోతీ యాత్ర కొన‌సాగుతుంద‌ని యాత్రికులు తెలిపారు. 150మంది క‌ర్నాట‌క కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి 34వ జ్యోతి యాత్ర త‌మిళ‌నాడులోని శ్రీ‌పెరంబుదూర్ నుండి ఈనెల 9న ప్రారంభ‌మైంద‌ని 19న ఢిల్లీకి చేరుకుంటుంద‌ని అన్నారు. అక్క‌డ వీర్ భూమి వ‌ద్ద ఏఐసీసీ జాతీయాధ్య‌క్షులు మ‌ల్లికార్జున‌ ఖ‌ర్గే,సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అజ‌య్ మాకెన్ , ప్రియాంకా గాందీ , కేసీ వేణుగోపాల్ లాంటి ఏఐసీసీ పెద్ద‌లు జ్యోతిని స్వీక‌రించి రాజీవ్ స‌మాధి వ‌ద్ద శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టిస్తార‌న్నారు. దేశంలో ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాల‌కు వ్య‌తిరేకంగా జాతీయ స‌మైక్య‌త కోసం ఈ యాత్ర సందేశ‌మిస్తున్న‌ట్టు తెలిపారు. అనంత‌రం మాజీ ఎంపీ సోయం బాపూరావు ,డీసీసీబీ చైర్మ‌న్ అడ్డి భోజారెడ్డి ల‌తో పాటు ప‌ట్ట‌ణ కాంగ్రెస్ శ్రేణులు రాజీవ్ జ్యోతిని ద‌ర్శించి ఆదిలాబాద్ నుండి యాత్రికుల‌కు వీడ్కోలు ప‌లికారు. ఈ కార్య‌క్ర‌మంలో యాత్రికుల‌తో పాటు కాంగ్రెస్ నాయ‌కులు గిమ్మ సంతోష్ , గుడిప‌ల్లి న‌గేష్ ,స‌య్య‌ద్ సుజాత్ అలీ, సయీద్ ఖాన్, బండారి సతీష్, కలాల శ్రీనివాస్,జాఫర్ అహ్మద్,బండి దేవిదాస్ చారి,సుధాక‌ర్ గౌడ్ , లోక ప్రవీణ్ రెడ్డి, లోకారి పోశెట్టి,ఎల్మ రామ్ రెడ్డి, మొహమ్మద్ రఫీక్, మహేందర్, ఎం. ఏ కయ్యుమ్, అతిక్ ఉర్ రహమాన్,అయాస్,అంజాద్, తోఫిక్,నలిమెల పోతా రెడ్డి,అల్లాబకష్ మహిళా నాయకురాలు శ్రీలేఖ , జుబేదా, అఫ్రోజా ,రేణుక తదితరులు పాల్గొన్నారు.

Latest