Mahaa Daily Exclusive

  కంది శ్రీ‌నివాస రెడ్డి క్యాంపు కార్యాల‌య ఆవ‌ర‌ణ‌లో ఘ‌నంగా స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుకలు..!

Share

ఆదిలాబాద్  మ‌హా :  నేటి స్వాతంత్య్ర దినోత్స‌వం మ‌నం అనుభ‌విస్తున్న‌ స్వేఛ్చ  ఎంద‌రో వీరుల త్యాగ ఫ‌ల‌మ‌ని డీసీసీబీ చైర్మ‌న్ అడ్డి భోజారెడ్డి , మాజీ ఎంపీ సోయం బాపూరావు అన్నారు. 79వ స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుకల సంద‌ర్భంగా శుక్ర‌వారం ఆదిలాబాద్ ప‌ట్ట‌ణంలోని కంది శ్రీ‌నివాస రెడ్డి క్యాంపు  కార్యాల‌యంలో జ‌రిగిన జాతీయ ప‌తాకావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మానికి హాజ‌రై జెండాను ఎగుర‌వేసారు.మ‌న దేశ స్వాతంత్య్ర కోసం త‌మ జీవితాల‌ను అంకితం చేసిన మ‌హ‌నీయుల త్యాగాల‌ను స్మ‌రించుకోవాల‌న్నారు. ఈసంద‌ర్భంగా  ప్ర‌జ‌ల‌కు కాంగ్రెస్ నాయ‌కుల‌కు కార్యక‌ర్త‌ల‌కు 79 స్వాతంత్య్ర‌ దినోత్సవ శుబాకాంక్ష‌లు తెలిపారు.  ఈకార్యక్ర‌మంలో కాంగ్రెస్ నాయ‌కులు గిమ్మ సంతోష్ , గుడిప‌ల్లి న‌గేష్ ,స‌య్య‌ద్ సుజాత్ అలీ, సయీద్ ఖాన్, బండారి సతీష్, కలాల శ్రీనివాస్,జాఫర్ అహ్మద్,బండి దేవిదాస్ చారి,సుధాక‌ర్ గౌడ్ , లోక ప్రవీణ్ రెడ్డి, లోకారి పోశెట్టి,ఎల్మ రామ్ రెడ్డి, మొహమ్మద్ రఫీక్,  మహేందర్, ఎం. ఏ కయ్యుమ్, అతిక్ ఉర్ రహమాన్,అయాస్,అంజాద్, తోఫిక్,నలిమెల పోతా రెడ్డి,అల్లాబకష్ మహిళా నాయకురాలు శ్రీలేఖ , జుబేదా, అఫ్రోజా ,రేణుక తదితరులు పాల్గొన్నారు.

Latest