Mahaa Daily Exclusive

  లేళ్ళ గోపాలరెడ్డిని పరామర్శించిన వైరా ఎమ్మెల్యే …!

Share

జూలూరుపాడు, ఆగస్టు 17, (మహా): ఇటీవల రెండు కాళ్లకు శాస్త్ర చికిత్స చేయించుకొని విశ్రాంతి పొందుతున్న నర్సాపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లేళ్ళ గోపాలరెడ్డిని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ఆదివారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకొని పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు లేళ్ళ వెంకటరెడ్డి, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు అల్లడి నరసింహారావు, మండల అధ్యక్షుడు మంగిలాల్ నాయక్, దుద్దుకూరి మధుసూదనరావు, ధరావత్ రాంబాబు, నున్న రంగారావు తదితరులు పాల్గొన్నారు.

Latest