చింతకాని, మహా.
చింతకాని మండలం నాగులవంచ రైల్వే స్టేషన్ మళ్లీ ప్రారంభమైంది. ఆదివారం ఈ స్టేషన్‌ను రైల్వే శాఖ కమర్షియల్ అధికారులు తిరిగి ప్రారంభించారు.
70 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ రైల్వే స్టేషన్‌ను ఇటీవల ఆదాయం తక్కువగా ఉందన్న కారణంతో మూసివేసిన విషయం తెలిసిందే. దీనిపై స్థానికులు వారం రోజులుగా ఆందోళనలు చేపట్టారు. ప్రజల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ తిరిగి స్టేషన్ ప్రారంభానికి ఆదేశాలు జారీ చేసింది.
ఖమ్మం రైల్వే స్టేషన్ చీఫ్ బుకింగ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసు టికెట్ కౌంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సమీప గ్రామాల ప్రజలు స్టేషన్ పునఃప్రారంభాన్ని స్వాగతిస్తూ ఆయనకు అభినందనలు తెలిపారు.
Post Views: 95







