Mahaa Daily Exclusive

  సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను కొనసాగించాలి వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద…!

Share

వరంగల్, మహా;

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను కొనసాగించాలని
జిల్లా కలెక్టర్ డా సత్య శారద అన్నారు.
సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375 వ జయంతి ఉత్సవాల సందర్భంగా జిల్లా కలెక్టర్ డా సత్య శారద , అదనపు కలెక్టర్ జి సంధ్యా రాణి పాల్గొని శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని అన్నారు. ఆయన చూపిన ధైర్యం, తెగువ, సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటం అందరికీ ఆదర్శమని , వారి ఆశయాలను కొనసాగించాలని పేర్కొన్నారు. మన పూర్వీకుల జీవన పద్ధతుల్ని, కృషిని ప్రతిబింబించే ఈ వృత్తులను మరువకుండా, తదుపరి తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో 41వ డివిజన్ కార్పొరేటర్ పోశాల పద్మ, డిఆర్ ఓ విజయలక్ష్మి, జెడ్పి సీఈఓ రామిరెడ్డి, జిల్లా వెనుక బడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి పుష్పలత, గౌడ్ సంఘ నాయకులు,
సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Latest