వరంగల్ మహా;
గ్రేటర్ వరంగల్ నగరంలోని 66 డివిజన్ల లోని కాలనీలలో ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలలో
వరద నీరు నిలిచి ఉండకుండా ఎప్పటికపుడు పూడిక తొలగింపు చేపట్టాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. సోమవారం వరంగల్ పరిధి 13, 22 డివిజన్ ల పరిధి లోని ఏకశిలా నగర్ దేశాయిపేట రోడ్డు చిన్న వడ్డేపల్లి చెరువు కట్ట ప్రాంతాలతో పాటు 22వ డివిజన్ పరిధిలోని కొత్తవాడ బ్యాంక్ కాలనీ మర్రి వెంకటయ్య కాలనీ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి శానిటేషన్ తీరును పరిశీలించారు.
ఈ సందర్భం గా కమిషనర్ మాట్లాడుతూ
వరద ముంపు నివారణ కోసం తగు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఇందుకోసం వరద నీరు వడ్డేపల్లి చెరువు లో కలువ నున్న క్రమంలో కమిషనర్ ఆ ప్రాంతాల్లో పర్యటించి వాస్తవ పరిస్థితులను అధికారులను కార్పొరేటర్ లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పారిశుద్ధ్య సిబ్బంది హాజరును తనిఖీ చేసిన కమిషనర్ ఫీల్డ్ లో పనిచేస్తున్నారో లేదా జవాన్లను అడిగి తెలుసుకున్నారు. ఇద్దరు రెగ్యులర్ జవాన్లు దీర్ఘ కాలికం గా గైర్హాజరు నేపథ్యంలో వారికి వేతనం వస్తుందా తెలుసుకోవడానికి ఆన్ లైన్ లో ఎంక్వైరీ చేశారు, జవాన్ లకు సూచనలు చేస్తూ ప్లాస్టిక్ ను విక్రయిస్తున్న వారికి పెనాల్టీ లు విధించాలని, ప్రతి గృహం నుండి 100% చిత్త సేకరణ జరగాలని, వర్షాకాలం నేపథ్యంలో వరద నీరు నిలువ ఉండకుండా ఉండడానికి ఎప్పటికప్పుడు డ్రైన్ లలో పూడిక ను తొలగించాలని కమిషనర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సురేష్ జోషి, బస్వరాజు కుమారస్వామి, సి ఏం హెచ్ ఓ డాక్టర్ రాజారెడ్డి, ఏం హెచ్ ఓ డాక్టర్ రాజేష్, డిఈ సతీష్, సానిటరీ సూపర్ వైజర్ భాస్కర్, శానిటరీ ఇన్స్పెక్టర్ భీమయ్య, హెల్త్ ఇన్స్పెక్టర్ మధుకర్, తదితరులు పాల్గొన్నారు.







