వరంగల్ మహా;
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న 452మంది ఔట్ సోర్సింగ్ కార్మికుల జీతాలు వెంటనే ఇవ్వాలని, ఒక్కపూట పనినీ వెంటనే అమలు చేయాలని,
హార్టికల్చర్, మలేరియా, వాటర్ సప్లై విభాగాలలో పనిచేస్తున్న డైలీవేజ్ కార్మికులకు కలెక్టర్ గెజిట్ ప్రకారం పెంచిన వేతనాలు అమలు చేయాలని, ఆల్ హెవీ వెహికల్స్ డ్రైవర్స్ పెంచిన 20500
రూపాయలు వెంటనే అమలు చేయాలని, కార్పొరేషన్ లో పనిచేస్తున్న అన్ని విభాగాల మున్సిపల్ కార్మికులకు పిపి కిట్స్, యూనిఫామ్స్ రెయిన్ కోట్స్ తో పాటు రక్షణ కోసం ఇతర మెటీరియల్స్ వెంటనే అందజేయాలని డిమాండ్ చేస్తూ
సోమవారం గ్రీవెన్స్ సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో కమిషనర్ చాంబర్ ఎదుట ధర్నా చేపట్టడం జరిగింది.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు టి ఉప్పలయ్య, సిఐ టియు జిల్లా కోశాధికారి సింగారపు బాబు మాట్లాడుతూ గత ఆరు నెలల నుండి మున్సిపల్ కార్పొరేషన్ లో కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా పాలకవర్గం, ఉన్నతాధికారులు కార్మికుల జీవితాలతో ఆటలాడుతున్నారని విమర్శించారు. ఆగస్టు 18వ తేదీ వచ్చిన ఇప్పటివరకు వేతనాలు ఇవ్వకుంటే మునిసిపల్ కార్మికులు ఎలా పనిచేయాలి? తమ కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి ఉపవాసాలు ఉంటూ పనిచేయాలా? అని ప్రశ్నించారు. మే 20న జిల్లా కలెక్టర్ డైలీవేజ్ కార్మికుల జీతాలు పెంచుతూ గెజిట్ విడుదల చేసి 4 నెలలు కావస్తున్న ఇంతవరకు జిల్లా కలెక్టర్ గెజిట్ ను అమలు చేయకుండా బల్దియా పెద్దలు కాలయాపన చేస్తున్నారని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కార్యదర్శి జన్ను ప్రకాష్, హనుమకొండ జిల్లా అధ్యక్షులు బరుపట్ల మహేష్ పాల్గొన్నారు.







