Mahaa Daily Exclusive

  శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ వారిని దర్శించుకున్న బిజెపి నాయకులు …!

Share

ఖమ్మం, మహా.
ముచ్చింతలలో శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామచంద్ర రావు తో కలిసి బీజేపీ రాష్ట్ర నాయకులు దేవకి వాసుదేవ రావు దర్శించుకుని స్వామివారి మంగళాశాసనాలు స్వీకరించారు . చిన్నజీయర్ స్వామివారు దేశం , రాష్ట్ర ప్రజల శ్రేయస్సు , సమాజంలోని సత్సంకల్పాల సాధన కోసం ఆశీర్వదించారు . ఆయన దీవెనలు అందుకోవడం ఎంతో దైవసౌభాగ్యమని బీజేపీ రాష్ట్ర నాయకులు పేర్కొన్నారు . ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామచంద్ర రావు మాట్లాడుతూ “చిన్నజీయర్ స్వామివారి ఆశీస్సులు మనకు దివ్యశక్తిని , మార్గదర్శకత్వాన్ని ప్రసాదిస్తాయి . ప్రజల అభ్యున్నతి కోసం , సమాజంలోని ప్రతి వర్గం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తాము అని అన్నారు . స్వామివారి దీవెనలు మనకు దిశానిర్దేశం చేస్తాయి” అని తెలిపారు . ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు , బీజేపీ కార్యకర్తలు పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు పొందారు

Latest