Mahaa Daily Exclusive

  భాగ్యనగర్ తండాలో కళకళలాడిన తీజ్ ఉత్సవాలు ముఖ్య అతిథిగా పాల్గొన్న హేమలత బాలాజీ నాయక్ గిరిజనుల ఆత్మీయ ఆతిథ్యం మధ్య ఘన స్వాగతం ..!

Share

కారేపల్లి, మహా:కారేపల్లి మండల పరిధిలోని భాగ్యనగర్ తండాలో ఆదివారం తీజ్ పండుగ సంబరాలతో నిండిపోయింది. మండల కాంగ్రెస్ నాయకురాలు హేమలత బాలాజీ నాయక్ ఈ వేడుకలలో పాల్గొనగా, బంజారా గిరిజనులు తమ సంప్రదాయ నృత్యాలతో ఆత్మీయంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా హేమలత బాలాజీ నాయక్ మాట్లాడుతూ గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు మన దేశానికి గర్వకారణమని కొనియాడారు. ఈ సమాజంలో మేము గిరిజనులుగా పుట్టడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు.గిరిజనుల ఆచారాలను కాపాడుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పండుగ గిరిజన మహిళలకు మరింత శక్తిని, ఆనందాన్ని ఇవ్వాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం తరువాత స్థానిక నాయకులు, ప్రజలతో కలిసి కాసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగుగులోత్ భద్రు రాందాస్, మహేష్, ఉపేందర్, వెంకటేష్, పోలంపల్లి గ్రామ పంచాయతీ ఇంద్రమ్మ కమిటీ సభ్యులుగుగులోత్ కళ్యణ్, గుగులోత్ నవీన్, లాకావత్ రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Latest