భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్ట్ 18 (మహా):
ప్రీ ప్రైమరీ, పీఎం శ్రీ విద్యను అంగన్వాడీ కేంద్రాలకే అప్పగించాలని, విద్యాబోధన బాధ్యతను అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ కు ఇవ్వాలని, ఐసిడిఎస్ ను బలోపేతం చేయాలని .పోసన్ ట్రాకర్ యాప్ లో పేస్ క్యాప్చర్ (ఎఫ్ ఆర్ ఎస్) యాప్ ను రద్దు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు బ్రహ్మచారి తెలంగాణ అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు జిల్లా కార్యదర్శి జి పద్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
యూనియన్ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం స్థానిక కలెక్టర్ కార్యాలయం ముందు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ డి డబ్ల్యు డి స్వర్ణలతలేనినా కి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పై అధికారుల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు .
అంగన్వాడి జిల్లా అధ్యక్షులు ఈసం వెంకటమ్మ అధ్యక్షతన జరిగిన సభలో సిఐటియు అధ్యక్షులు బ్రహ్మచారి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఐసిడిఎస్ను, విద్యారంగాన్ని నిర్వీర్యం చేయడం కోసం నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చిందని దీనివల్ల రాబోయే కాలంలో అంగన్వాడీ వ్యవస్థ క్రమేణ రద్దు అవుతుందని వారు తెలిపారు. ప్రీ ప్రైమరీ, పీఎం శ్రీ, ఇంగ్లీష్ మీడియం విద్య పేరుతో ఐదు సంవత్సరాల లోపు పిల్లలను విద్యాశాఖకు అప్పగించడం సబబు కాదని, విద్యాబోధన బాధ్యతను అంగన్వాడీలకు మాత్రమే ఇవ్వాలని వారు కోరారు. ఆరు సంవత్సరాల లోపు పిల్లలకు విద్య తోపాటు, పౌష్టికాహారాన్ని అందిస్తూ మానసిక, శారీరక అభివృద్ధికి గత 50 సంవత్సరాలుగా పాటుపడుతున్న అంగన్వాడి వ్యవస్థను నిర్వీర్యం చేయడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ఈ విధానాన్ని తక్షణం మార్చుకొని అంగన్వాడీలకే అదనపు వేతనం చెల్లించి, పీఎం శ్రీ, ప్రైమరీ స్కూల్లో బాధ్యతను వారికి అప్పగించాలని కోరారు. అలాగే బిఎల్ఓ తదితర అదనపు పనులను అప్పగించడం మానీవేసి విద్యాబోధన మాత్రమే వారికి కేటాయించాలని డిమాండ్ చేశారు. ఐసిడిఎస్ శాఖకు ప్రభుత్వ నిధులను పెంచి మౌలిక వసతులు కల్పించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. 2జి సెల్ ఫోన్లు ఇచ్చి యాప్ లన్ని అందులో చేయమనడం అధికారులు బెదిరించడం సరినది కదనీ అన్నారు పోసన్ ట్రాకర్ పేస్ క్యాప్చర్ ( ఎఫ్ ఆర్ ఎస్) యాప్ ను రద్దుచేయాలిను. నాణ్యనాతతో కూడిన 5g ఫోన్లు ఇవ్వాలని నెట్ సౌకర్యం ట్యాబులు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కె సత్య అంగన్వాడి జిల్లా నాయకులు విజయ, శీలా, కళావతి, రాధకుమారీ భానుశ్రీ, కృష్ణవేణి, హేమలత, సారమ్మ, పాతిమా, శైలజ, సావిత్రి, వీరభద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.







