Mahaa Daily Exclusive

  తల్లాడలో ఘనంగా సర్దార్ పాపన్న గౌడ్ జయంతి వేడుకలు.. !

Share

తల్లాడ, ఆగస్టు, 18, (మహా)
సర్వాయి సర్దార్ పాపన్న గౌడ్ 375 వ జయంతి వేడుకలను సోమవారం తల్లాడలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి గౌడ సంఘం నాయకులు నాసగోని సురేష్ బాబు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం సురేష్ బాబు మాట్లాడుతూ సర్దార్ పాపన్న గౌడ్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్దార్ పాపన్న గౌడ్ జిల్లా అధ్యక్షులు రావుల గోపిగౌడ్, గౌడ్ సంఘం నాయకులు మొక్కా బసవయ్య, మొక్కా కృష్ణార్జున్, ముత్యాల సత్యం, కొంగల దాసు, రామకృష్ణ, గుండ్ల రాగా, తదితరులు పాల్గొన్నారు.

Latest