చింతకాని, మహా.
ముదిగొండ మండలంలోని పమ్మి నుంచి చింతకాని మండలం నాగులవంచ విద్యుత్ స్టేషన్ వరకు 33 కెవి విద్యుత్ లైన్ ఏర్పాటు పనులకు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు శ్రీకారం చుట్టారు. నాగులవంచ గ్రామంలో సోమవారం జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులంతా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, కొత్తగా ఏర్పాటు చేసిన 33 కెవి విద్యుత్ లైన్ ద్వారా నాగులవంచ, చింతకాని, పందిళ్లపల్లి సబ్‌స్టేషన్ల పరిధిలోని గ్రామాలన్నీ అదనపు విద్యుత్ సౌకర్యం పొందనున్నాయి అని తెలిపారు. ఇప్పటి వరకు ఖమ్మం లేదా మధిర నుంచి సరఫరాలో అంతరాయం ఏర్పడిన సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇకపై పమ్మి నుంచి వచ్చే ఈ కొత్త లైన్ ద్వారా నిరంతర విద్యుత్ సరఫరా అందుబాటులో ఉంటుందని వారు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్.ఈ. ఇనుగుర్తి శ్రీనివాసాచారి, డి.ఈ. నంబూరు రామారావు, భద్ర పవర్ ఏ.డీ.ఈలు తిలక్, కిరణ్ చక్రవర్తి, ఏ.ఈలు ఉమామహేశ్వరి, చావా శ్రీధర్, లైన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, లైన్మెన్లు రమేష్ కుమార్, కిషోర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు







