Mahaa Daily Exclusive

  ఇల్లందులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన…!

Share

ఇల్లందు, మహా.
ఇల్లందు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే కోరం కనకయ్య కలిసి శంకుస్థాపన చేశారు.

టేకులపల్లి మండలంలోని పలు గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి, ఇల్లందు మండలం మామిడిగుండాల గ్రామ పంచాయతీ పరిధిలోని మెడికుంట-మసివాగు మధ్య నిర్మించబోయే వంతెనకు శ్రీకారం చుట్టారు. అదేవిధంగా ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలో జె.కె. కాలనీలో మినీ స్టేడియం నిర్మాణ పనులకు, సుభాష్‌నగర్ నుంచి లలితాపురం వరకు రహదారి విస్తరణ, సెంటర్ లైటింగ్ పనులకు పునాది వేశారు. ఈ ప్రాజెక్టులు కలిపి సుమారు 11.06 కోట్ల వ్యయంతో చేపట్టబడుతున్నాయి.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, “ప్రజలకు ఇచ్చిన మాట తప్పకుండా నిలబెట్టుకుంటాం. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు అందేలా చూస్తాం” అని తెలిపారు. అలాగే, ప్రారంభించిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ రాంబాబు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మండల రాము, మున్సిపల్ చైర్మన్లు దమ్మాలపాటి వెంకటేశ్వర్లు, యదలపల్లి అనసూర్యతో పాటు పలువురు నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Latest