Mahaa Daily Exclusive

  వరద పరిస్థితిపై ముందస్తు అంచనాకు సిసి కెమెరా ల ద్వారా పర్యవేక్షణ… జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి…!

Share

ఖమ్మం,మహా.
గత సంవత్సర అనూహ్య వరదలను దృష్టిలో పెట్టుకొని ముందస్తు జాగ్రత్తలకు పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. సోమవారం కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో ఆకేరు, మున్నేరు ల వద్ద ఏర్పాటుచేసిన సిసి కెమెరా ల పనితీరును పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ, గత సంవత్సర అనూహ్య వరదల దృష్ట్యా ముందస్తుగానే వరద పరిస్థితి తెలుసుకొని, సహాయక చర్యలు చేపట్టే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

ఇకపై వరదల గురించి, ముందస్తుగా తెలియడానికి ఆకేరు వాగుకు సంబంధించి తిరుమలాయపాలెం మండలం తిప్పారెడ్డిగూడెం వద్ద, మున్నేరు కు సంబంధించి డోర్నకల్ వద్ద సోలార్ డే అండ్ నైట్ విజన్ కెమెరాలు ఏర్పాటుచేసి, 24/7 గంటలు పర్యవేక్షణ చేయనున్నట్లు తెలిపారు. ఇట్టి కెమెరా లను కలెక్టరేట్ లోని కంట్రోల్ రూమ్, కలెక్టర్ ఛాంబర్ కు అనుసంధానం చేసి, 24 గంటలు నీటి ప్రవాహం ప్రత్యక్షంగా చూస్తూ, ప్రమాద పరిస్థితిని ముందస్తుగా అంచనా వేసి, అవసరమైతే ముంపు ప్రాంతాల ప్రజలను ముందస్తుగా నష్టం వాటిల్లకుండా సురక్షిత ప్రాంతానికి లేదా పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లేలా చర్యలు చేపట్టవచ్చన్నారు. ఇట్టి కెమెరా తో అధికారులు తమ మొబైల్ ఫోన్ల ద్వారా పరిస్థితి ని పర్యవేక్షణ చేయవచ్చన్నారు. ఇప్పటికే మున్నేరు, ఆకేరు నదుల పరివాహక ప్రాంతాల సంబంధిత అధికారులతో వర్షం, వరద పరిస్థితిపై సమాచారం ఎప్పటికప్పుడు సేకరిస్తున్నట్లు కలెక్టర్ అన్నారు. సిసి కెమెరాల ఏర్పాటుతో అధికారులు, లష్కర్ తదితర సిబ్బంది క్షేత్రస్థాయిలో ఉంటూ, ప్రమాద పరిస్థితులను ఎదుర్కొనే అవసరం ఉండదన్నారు.

ఖమ్మం కాల్వ ఒడ్డు లోని ఇదే తరహా సోలార్ డే అండ్ నైట్ విజన్ కెమెరా ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ అన్నారు. నిరంతరం ఆకేరు, మున్నేరు ప్రవాహం, నీటి మట్టం కెమెరాల ద్వారా చూస్తూ, ముంపు ప్రాంతాల ప్రజలకు వరదల వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ఎంతో వెసులుబాటు కలుగుతుందని, అధికారులకు ముందస్తుగా సహాయ చర్యలు చేపట్టుటకు, ప్రజలు సురక్షితంగా ఉండే అవకాశం వుంటుందని కలెక్టర్ తెలిపారు.

ఈ సందర్భంగా ఇర్రిగేషన్ డిఇ రమేష్ రెడ్డి, అధికారులు తదితరులు ఉన్నారు.

Latest