రంగారెడ్డి జిల్లా మహా:
షాబాద్ నగరంలో పహిల్వాన్ చెరువు నిండడంతో ప్రాంతంలో జలకల సంతరించుకుందని మధుసూదన్ రెడ్డి అన్నారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా షాబాద్ లోని పహిల్వాన్ చెరువు నిండి అలుగు పారుతుంది. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి చెరువు గట్టున ఉన్న ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… షాబాద్ నగరంలో పహిల్వాన్ చెరువు నిండడంతో ప్రాంతంలో జలకల సంతరించుకుందని మధుసూదన్ రెడ్డి అన్నారు. చెరువు ఎప్పుడు నిండుగా కళకళలాడాలని ఆకాంక్షించారు. పరిసర ప్రాంతాలలోని రైతులు పంటలు పండించి, సుభిక్షంగా ఆనందంగా ఉండాలని పేర్కొన్నారు. అనంతరం చెరువు అలుగుతో పాటు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. చెరువులోకి వస్తున్న మురుగు నీరు ప్రత్యేక కాలువ ద్వారా చెరువులకు రాకుండా పనులను ప్రారంభించాలని గ్రామపంచాయతీ సిబ్బందికి సూచించడంతో వెంటనే పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుడిమల్కాపూర్ మార్కెట్ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, మాజీ ఎంపిటిసి కుమ్మరి చెన్నయ్య, మాజీ సర్పంచులు జనార్దన్ రెడ్డి, మహేందర్ గౌడ్, నర్సింలు, శ్రీనివాస్ గౌడ్, లింగం, నాయకులు దండు రాహుల్, ప్రభాకర్ రెడ్డి, సంజీవరెడ్డి, సుభాష్ రెడ్డి, గౌరీశ్వర్, గౌతమ్, కిషోర్, రఫిక్, రమేష్, శేఖర్, పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.







