వరంగల్ మహా;
బీఎస్సీ నర్సింగ్ చదువు తున్న విద్యార్థిని అదృశ్యమైన ఘటన వరంగల్ జిల్లాలోని వంచనగిరి శాయంపేట గ్రామం లో చోటుచేసుకుంది. గీసుగొండ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శాయంపేట గ్రామానికి చెందిన గాలి అరుణ ఫిర్యాదు మేరకు ఆమె కుమార్తె గాలి చైతన్య (26) కనిపించకుండా పోయింది. బీఎస్సీ నర్సింగ్ చదువుకున్న చైతన్య అదృశ్యంపై ఆమె తల్లి గీసుగొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గీసుగొండ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మహేందర్ ఈ విషయంపై దర్యాప్తు కొనసాగుతోందని, యువతి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. చైతన్య ఆచూకీ తెలిసిన వారు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
Post Views: 10







