Mahaa Daily Exclusive

  కేంద్ర మంత్రిని కలసిన వరంగల్ ఎంపీ..!

Share

వరంగల్ మహా;

కేంద్ర ఆరోగ్య
శాఖ మంత్రి జె.పి. నడ్డాను గురువారం వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఇప్పటికే ఆమోదం పొందిన సీజీహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్ ను త్వరగా ప్రారంభించాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కడియం కావ్య మాట్లాడుతూ, వరంగల్లో వేలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు ఉన్నారని, వరంగల్ లో సౌకర్యాలు లేకపోవడం వల్ల వారు హైదరాబాద్ లేదా ఇతర నగరాలకు వెళ్లి చికిత్స పొందాల్సి వస్తోందని తెలిపారు. ఇది వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వరంగల్లో సీజీహెచ్ఎస్ సెంటర్కు ఆమోదం తెలిపిందని, కానీ ఇంకా ప్రారంభం కానందు వల్ల ఉద్యోగులు, పెన్షనర్లు నష్టపోతున్నారని తెలిపారు. వెంటనే వరంగల్లో వైద్య సిబ్బంది నియామకం చేపట్టి, శాశ్వత భవనం కేటాయించి సెంటర్ను ప్రారంభించాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి జె.పి నడ్డా వరంగల్ లో సీజీహెచ్ఎస్ ఏర్పాటుకు కృషి చేస్తానని వెల్లడించారు.

Latest