హన్మకొండ మహా;
గురుకుల హాస్టల్ లో సౌకర్యాలు మెరుగ్గా ఉండాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు.
గురువారం హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండ శివారులోని తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, కళాశాలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భం గా హాస్టల్లోని వంటగది, డైనింగ్ హాల్, ప్రాంగణం, స్టోర్ రూమ్, తరగతి గదులను కలెక్టర్ పరిశీలించారు. హాస్టల్ నిర్వహణకు సంబంధించిన పలు రికార్డులను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. కిచెన్ రూమ్ లో కూరగాయలు, పప్పులు, వంట నూనెలు, తదితర నిత్యావసరాలను కలెక్టర్ తనిఖీ చేసి తాజా కూరగాయలు, నాణ్యమైన వంట పదార్థాలను వంటల్లో వినియోగించాలన్నారు. అదేవిదంగా ఆర్ట్ రూంలో విద్యార్థులు వేసిన పెయింటింగ్స్ బాగున్నాయని కలెక్టర్ సంతోషం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సమన్వయ అధికారి దాసరి ఉమామహేశ్వరి, కాజీపేట తహసీల్దార్ భావ్ సింగ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.







