Mahaa Daily Exclusive

  భర్తను చంపిన కేసులో భార్యకు , భార్య ప్రియునికి యావజ్జివా కారాగార శిక్ష..!

Share

కాటారం మహా : భూపాలపల్లి జిల్లా మా ముత్తారం పోలీస్ స్టేషన్లో పరిధిలో రేగులగూడెం గ్రామంలో జరిగిన అనుమానాస్పద మృతిని పోలీసులు విచారణ చేసి హత్యగా కేసు నమోదు చేశారు. ఈ కేసు గురువారం భూపాలపల్లి కోర్టులో వాదనలు జరగగా ఇరువురికి జీవితకాలం కారాగార శిక్ష విధిస్తూ స్టేషన్స్ జడ్జి తీర్పునిచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి.
21.8.2020 తేదీన మహాముత్తారం మండలం రేగుల గూడెం గ్రామానికి చెందిన మారుపాక నరసయ్య(56) కొడుకు మారుపాక దేవేందర్(32) అనే వ్యక్తి అనుమానాస్పద మృతి చెందినట్లుగా దానిపై విచారణ చేయాలని ఎస్సై సిహెచ్ శ్రీనివాస్ కి ఫిర్యాదు చేశారు. ఆఫిర్యాదు పై అనుమానాస్పద మృతిగా Cr No 126/2020 నందు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే క్రమంలో మృతుడి భార్య మారుపాక స్వప్న(33) మహాముత్తారం గ్రామానికి చెందిన లింగమల్ల కళ్యాణ్(26) తో అక్రమ సంబంధం ఏర్పరచుకొనిభర్త అడ్డు వస్తున్నాడని అతన్ని అడ్డు తొలగిస్తే సంతోషంగా ఉండొచ్చు అనే ఆలోచనతో మారుపాక స్వప్న,ఆమె ప్రియుడైన లింగమల్ల కళ్యాణ్ ఇద్దరు కలిసి తన భర్త అయిన మారుపాక దేవేందర్ ని చంపాలని నిశ్చయించుకొని మద్యం అలవాటు ఉన్న మారుపాక దేవేందర్ ను మద్యంలో విషం కలిపి అతనితో తాగించి చంపాలనే ఉద్దేశంతో ముందస్తు పన్నాగం పన్నారు. లింగమల్ల కళ్యాణ్ ఒక మద్యం బాటిల్,విషాన్ని తీసుకొని వచ్చి స్వప్నకి ఇవ్వగా స్వప్న తన భర్త అయినా మారుపాక దేవేందర్ కి అట్టి మద్యం బాటిల్ లో విషాన్ని కలిపి తనతో తాగించి అది తాగడం వలన దేవేందర్ చనిపోగా మద్యం ఎక్కువై చనిపోయినట్లుగా నాటకం ఆడటం జరిగినది. కాగా పోలీసు విచారణలో పోస్టుమార్టం రిపోర్టు లో విష ప్రయోగం వలన దేవేందర్ చనిపోయినట్లుగా నిర్ధారణ కాగా అనుమానాస్పద మృతి కేసును హత్య కేసుగా మార్పు చేసి అప్పటి కాటారం సర్కిల్ ఇన్స్పెక్టర్ హాతి రామ్ నాయక్ పూర్తిస్థాయిలో కేసు దర్యాప్తు చేశారు. మారుపాక స్వప్న, లింగమల్ల కళ్యాణి ముద్దాయిలుగా నిర్ధారించి వారి పైన కోర్ట్ నందు ఛార్జ్ షీట్ దాఖలు చేయగా కోర్టు విచారణలో భాగంగా పోలీసు శాఖ తరఫున ఏ శ్రీనివాస్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనలు వినిపించారు.ఆట్టి వాదనలతో ఏకీభవించిన భూపాలపల్లి డిస్టిక్ సెషన్ జడ్జి సిహెచ్ రమేష్ బాబు ఆట్టి ఇరువురు ముద్దాయిలకు జీవిత కాల కారాగార శిక్ష విధిస్తూ గురువారం తీర్పు వెలువరించారు. ఇట్టి ఇరువురు ముద్దాయిలను చర్లపల్లి సెంట్రల్ జైలుకి తరలించినట్లు మహాముత్తారం ఎస్సై ఎం మహేందర్ తెలిపారు. ఈ సందర్భంగా కేసు విచారణలో ప్రతిభ కనబరిచిన అప్పటి ఎస్సై సిహెచ్ శ్రీనివాస్, సిఐ హాతీ రామ్ సకాలంలో సాక్షులను ప్రవేశపెట్టి ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా జాగ్రత్తలు తీసుకున్న ప్రస్తుత కాటారం డిఎస్పి సూర్యనారాయణ, కాటారం సిఐ నాగార్జున రావు , ముత్తారం ఎస్ఐ మహేందర్ కుమార్ ని , కోర్టులైజన్ ఆఫీసర్ ఏఎస్ఐ జి వెంకన్న, కోర్టుపిసి కె రమేష్ లను ను జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే అభినందించారు.

Latest