Mahaa Daily Exclusive

  ఇవాళ సురవరం అంతిమయాత్ర..!

Share

TG: సురవరం సుధాకర్ రెడ్డి అంతిమయాత్ర ఇవాళ HYDలో జరగనుంది. ఉదయం 9 గంటలకు కేర్ ఆసుపత్రి నుంచి మగ్దూం భవన్ వరకు సురవరం అంతిమయాత్ర చేపట్టనున్నారు. పార్థివదేహాన్ని ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సందర్శనార్థం అక్కడే ఉంచుతారు. సీఎం రేవంత్, వెంకయ్య నాయుడు, ఇతర నేతలు నివాళులర్పించనన్నారు. అనంతరం అధికార లాంఛనాలతో అంతిమయాత్ర చేపట్టి, పార్థివదేహాన్ని గాంధీ మెడికల్ కాలేజీకి పరిశోధన నిమిత్తం అందజేస్తారు.

Latest