AP: ఉద్యోగులకు సంబంధించిన ఏ అంశంపైనా ప్రభుత్వం చర్చించడం లేదని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. విజయవాడలో శనివారం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల బకాయిల లెక్కలు తేల్చాలని డిమాండ్ చేశారు. 3 నెలల్లో ఆర్థిక, ఆర్థికేతర అంశాలు పరిష్కరించాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
Post Views: 15







