Mahaa Daily Exclusive

  అప్పు డబ్బులు ఇవ్వమని అడిగితే హత్యాయత్నం చేశాడు –నిందితుడి పై గతంలో పలు కేసులు నమోదు ..!

Share

మందమర్రి, మహా : అప్పు తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే హత్యాయత్నానికి పాల్పడిన ఘటన 25 ఆగస్టు 2025 న మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై రాజశేఖర్ కథనం ప్రకారం మందమర్రి పట్టణం విద్యానగర్ కు చెందిన ఎన్నం మొండి భార్య గత రెండు సంవత్సరాల క్రితం అదే ప్రాంతానికి చెందిన దేవసాని నరేందర్ (బైక్ మెకానిక్) కు డబ్బులు అప్పుగా ఇచ్చిందని తెలిపారు. ఆ తర్వాత కొద్ది రోజులకు మొండి భార్య మృతి చెందినట్లు వెల్లడించారు. దానితో మొండి నిందితుడు నరేందర్ ను డబ్బులు ఇవ్వాలని గత కొంతకాలంగా ఒత్తిడి చేస్తున్నాడని వివరించారు. ఎలాగైనా మొండిని అడ్డు తొలగించుకునేందుకు పథకం రచించాడని చెప్పారు. అందులో భాగంగా 25 ఆగస్టు నాడు మొండి తన ఇంట్లో రాత్రి ఒంటరిగా నిద్రిస్తుండగా దీనినే అదనగా భావించిన నేరస్తులు సురేందర్ ఒక స్టీలు పైపుతో అతనిపై విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచాడని ఎస్ఐ రాజశేఖర్ స్పష్టం చేశారు. గాయాల పాలైన మొండి కూతురు భాకం రజిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు మందమర్రి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా నమ్మదగిన సమాచారం మేరకు నిందితుడు దేవసాని నరేందర్ ను బుధవారం అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే నిందితుడు ఉపయోగించిన ఆయుధాన్ని ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని ఎస్సై చెప్పారు. నిందితుడు గతంలో కూడా పలు నేరాలకు పాల్పడి జైలుకు వెళ్లి బేలుపై విడుదలయ్యాడని అన్నారు.

Latest