Mahaa Daily Exclusive

  బాల్య‌విహాల‌పై అవ‌గాహ‌నా స‌ద‌స్సు ..!

Share

నిర్మల్ మ‌హా : నిర్మల్ జిల్లా మామడ మండలంలోని పోన్కల్ ఉన్నత పాఠశాలలో మంగళవారం జిల్లా న్యాయమూర్తి రాధిక ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహన సదస్సు నిర్వ‌హించారు. ఈసంద‌ర్భంగా గ్రామంలో విద్యార్ధుల‌చే అవ‌గాహ‌నా ర్యాలీ చేప‌ట్టారు. ఎక్కడైనా 18 సంవత్సరాలలోపు పిల్లలకి పెళ్లి జరుగుతున్నట్టు సమాచారం ఉంటే పాఠశాల ఉపాధ్యాయులకు, అంగన్వాడీ కార్యకర్తలు లేదా 1098 నంబర్ కి సమాచారం ఇవ్వాలని న్యాయమూర్తి రాధిక కోరారు. త‌ను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకొని సైంటిస్ట్ అవుతాననుకున్నాన‌ని కానీ లాయర్ తర్వాత న్యాయమూర్తిని అయ్యానని విద్యార్ధులు కూడా ఒక లక్ష్యం పెట్టుకుని చదవాలని అన్నారు. తల్లిదండ్రులకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు.వయసు వచ్చిన తర్వాతనే వివాహాలు చేయాలని, బాల్య వివాహాలు చేస్తే అనేక అనర్థాలు వస్తాయన్నారు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.

Latest