Mahaa Daily Exclusive

  దీపికా పదుకొనెకు కేంద్రం అరుదైన గౌరవం..

Share

  • దీపికా పదుకొనెకు కేంద్రం అరుదైన గౌరవం
  • తొలి మానసిక ఆరోగ్య రాయబారిగా నియామకం
  • మానసిక ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యతపై దీపిక హర్షం

 

ఢిల్లీ, మహా

 

బాలీవుడ్ అగ్రశ్రేణి హీరోయిన్ దీపికా పదుకొనె కు అరుదైన గౌరవం దక్కింది. మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా దీపికాను ఇండియా అంబాసిడర్‌గా నియమించారు. ది లివ్‌ లవ్‌ లాఫ్‌ ఫౌండేషన్‌ ద్వారా దీపికా మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్న సంగతి తెలిసిందే. మానసిక ఆరోగ్యం దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆరోగ్య, సంక్షేమ మంత్రిత్వ శాఖకు ఆమెను అంబాసిడర్‌గా నియమిస్తూ ప్రకటించింది. దీపికాను మనదేశ మొట్టమొదటి మానసిక ఆరోగ్య రాయబారిగా నియమించడం ద్వారా దేశంలో మానిసిక ఆరోగ్యం సమస్యల గురించి విస్త్రతంగా అవగాహన కల్పించడంలో సహాయపడుతుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో అభిప్రాయపడింది. మనదేశ తొలి మానసిక ఆరోగ్య రాయబారిగా ఎంపికవ్వడంపై దీపికా పదుకొనే ఆనందం వ్యక్తం చేసింది. దీనిపై ఆమె మాట్లాడుతూ.. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు మొదటి మానసిక ఆరోగ్య రాయబారిగా పనిచేయడం తనకు దక్కిన అరుదైన గౌరవమని, చాలా గౌరవంగా ఉందని పేర్కొంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో మొదటి సారి దేశ మానసిక ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం శుభసూచికమని, ఇది మానసి ఆరోగ్యం సంరక్షణకు గణనీయమైన పురోగతి అని పేర్కొంది.

Latest